![]() |
![]() |
.webp)
ఇప్పుడు స్టార్ మా టీవిలో అత్యంత వీక్షకాదరణ పొందుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్-655 లో జగతి, మహేంద్ర ఇద్దరు ఇంటికి వస్తారు. "రిషి వచ్చాడా" అని దేవయానిని అడుగుతాడు మహేంద్ర. అక్కడే ఉన్న రిషి వాళ్ళ పెద్ద నాన్న "ఏం జరిగింది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు" అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. ఆ తర్వాత అందరూ రిషి ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతారు. "కొంప తీసి రిషి ఏ అఘాయిత్యానికైనా పాటు పడలే కదా. రిషీకి ఏమైనా అయితే మీ సంగతి చెప్తా" అని దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
రిషి ఒంటరిగా పోలీస్ స్టేషన్ ముందు తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. "ఏంటి వసుధార ఇలా చేసావు. నాకు సమాధానం చెప్పేవరకు వెళ్ళను" అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి రాజీవ్ వచ్చి "మీ రిషి సర్ మళ్ళీ వచ్చాడు చూడు" అని చెప్తాడు. "నీ వల్లే సర్ మళ్ళీ వస్తున్నాడు. వెళ్ళమని చెప్పు" అని అంటుంది. అంతలోనే స్టేషన్ SI వచ్చి "మళ్ళీ వచ్చావా.. ఎందుకు వచ్చావ్?" అని బెదిరిస్తాడు. "ప్లీజ్ సర్. ఒకే ఒక్క ప్రశ్న అడిగి వెళ్ళిపోతా" అని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. రాజీవ్ తో మాట్లాడుతుంది వసుధార. "రిషి సర్ ని రానివ్వండి. నేను నిజం చెప్తాను" అంటుంది. అలా అనడంతో రాజీవ్ బెదిరిస్తాడు. "ఒక్కసారి ఇంట్లో జరిగింది గుర్తు చేసుకో వసుధార.. ఇక ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో" అని బెదిరిస్తాడు.
ఆ తర్వాత రిషి అక్కడే ఉండటం గమనించిన SI మాట్లాడుతూ "వీడు వెళ్ళేలా లేడు కదా.. ఆ ఒక్క మాట ఏంటో మాట్లాడి వెళ్తాడంట. వాడిని లోపలకి పంపించండి" అని చెప్తాడు. అప్పుడు వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి. "వసుధార.. ఆ తాళి ఎవరు కట్టారు" అని రిషి అడుగుతాడు. "నా ఇష్టప్రకారంగానే నా మెడలో ఈ తాళి పడింది సర్" అని వసుధార చెప్తుంది. ఒక్కసారిగా రిషి ఎమోషనల్ అవుతాడు."మీరు ఇక్కడి నుండి వెళ్ళండి సర్" అని అంటుంది. ఆ తర్వాత రిషి ఎమోషనల్ అవుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |